లెక్కల చిక్కులు !  కేటీఆర్ హరీష్ పైనే భారం !  

బఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు పెద్ద బాధ్యతలనే అప్పగించారు బీ ఆర్ ఎస్ అధినేత,  మాజీ సీఎం కెసిఆర్.

( KCR ) గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేసి , దానిని తమ కు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పుకొట్టే విధంగా,  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవి ఏవి తమకు ఇబ్బంది కాకుండా ఉండేలా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు.

  దీనిలో భాగంగానే కెసిఆర్ , హరీష్ రావులతో కీలక సమావేశాన్ని నిర్వహించి అనేక అంశాలపై చర్చించారు.  ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ఉండడం తో దానిని తిప్పికొట్టేందుకు ఏమేం చేయాలనే విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో హరీష్ రావు ఆర్థిక , ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చూడడంతో, వాటిపై ఆదాయ , వ్యయాలను బేరీజు  వేస్తూ.సాధించిన ప్రగతిని వివరించాలని కెసిఆర్ సూచించారు .

The Implications Of Calculations The Burden Is On Ktr Harish , Brs, Telangana

ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )పౌరసరఫరాలు , విద్యుత్ శాఖ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.అంతేకాదు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారి శాఖలకు సంబంధించిన అన్ని వివరాలను స్టడీ చేయాలని సూచించారు.అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల తో పాటు , అవినీతిపై వీడియోలను ప్రదర్శించి వివరించాలని నిర్ణయించడంతో , దానిని తిప్పికొట్టేందుకు అన్ని లెక్కలతో సహా వివరించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టి , ప్రజలలో చులకన కాకుండా ఉండేలా కేటీఆర్ , హరీష్ రావులు వ్యూహాలు పన్నుతున్నారు.

The Implications Of Calculations The Burden Is On Ktr Harish , Brs, Telangana
Advertisement
The Implications Of Calculations! The Burden Is On KTR Harish , BRS, Telangana

అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంలోని ఏ శాఖపై విమర్శలు వచ్చినా దానిని లెక్కలతో సహా వివరించి .ఆ విమర్శలను తిప్పుకొట్టే విధంగా హరీష్ రావు,  కేటీఆర్ ( Harish rao KTR )లు పూర్తిగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి,  ప్రాజెక్టులు , పథకాలు ఇలా అన్నిటి పైన పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎటు పరిస్థితిలోనూ పై చేయి సాధించకుండా కెసిఆర్ సూచనలతో కేటీఆర్ హరీష్ రావు లు కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు