'H1 - B' వీసాపై భారీ మార్పులు..?

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన నాటినుంచీ ట్రంప్ దూకుడు స్వభావం రోజు రోజుకి రెట్టింపు అవుతునోంది తప్ప ఎక్కడా తగ్గటం లేదు.స్థానిక ప్రజలు మొదలు.

ప్రపంచ దేశాలు.అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు ఇలా ఒకరేమిటి ప్రతీ ఒక్కరు ట్రంప్ విధానాలని తప్పు పడుతున్న వారే.

అంతేకాదు అతని భార్య సైతం ట్రంప్ చర్యలకి విసుగెత్తి పోతోందంటే ట్రంప్ పిచ్చ ఎంత పరాకాష్టకి చేరుకుందో అర్థమవుతుంది.

“H1 – B” వీసా విధానాలపై గత కొన్నేళ్ళుగా ట్రంప్ చేస్తున్న మారుపులు చేర్పులు ఎంతో మంది ఎన్నారైలని మానసికంగా వేదిస్తున్నాయి.కేవలం భారతదేశ ఎన్నారైలు టార్గెట్ గా ఈ చర్యలు ఉంటున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అయితే తాజాగా ట్రంప్ H1 – B విషయంలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకుని వచ్చాడట ఈ ప్రతిపాదనల వలన అధికశాతం భారత ఐటీ నిపుణులు ,అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్ల కి వారు నడిపిస్తున్న చిన్న చిన్న కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడనుందని తెలుస్తోంది.

Advertisement

ఈ మార్పుల విషయంపైనే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.2019 జనవరి నాటికి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) అందుకు సంబంధించి కసరత్తులు చేస్తుందని డీహెచ్‌ఎస్‌ తెలిపింది.

హెచ్‌ 1బీ వీసాలపై వచ్చే వారి ప్రతిభకు సంబంధించిన నిబంధనలను పునర్వచించేలా ప్రతిపాదనలు తీసుకురానున్నారు.అయితే ఈ మార్పులు చేయడం వల్ల అత్యుత్తమ ప్రతిభ ఉన్న విదేశీయులను ఎక్కువగా అమెరికావైపు నడిపించవచ్చు అనేది ట్రంప్ ఆలోచన.

Advertisement

తాజా వార్తలు