హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న కమెడియన్ పృథ్వీ కూతురు?

సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలెబ్రిటీల పిల్లలు వారసులుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల పిల్లలు వారి వారసులుగా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చారు.

ఇక పోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా అబ్బాయిలు వారసత్వముగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.వారసురాలు అంటే మంచు లక్ష్మీ ప్రసన్న, జీవిత కూతుర్లు ఇండస్ట్రీలో వారసురాళ్లుగా కొనసాగుతున్నారు.

ఇకపోతే త్వరలోనే మరొకరు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి మనకు తెలిసిందే.

ఈయన ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించారు.ఈ క్రమంలోనే ఈయన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందని స్వయంగా పృథ్వీ తెలియజేశారు.

Advertisement
The Daughter Of Comedian Prithviraj Is Entry As A Heroine, Comedian Prithiraj, T

హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన ఈమె మలేషియాలో స్థిరపడాలని కోరుకున్నారు.అయితే తనకు నటనపై ఆసక్తి ఉండటం వల్ల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని వెల్లడించారు.

The Daughter Of Comedian Prithviraj Is Entry As A Heroine, Comedian Prithiraj, T

ఈ క్రమంలోనే పృథ్వీ మాట్లాడుతూ నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమా నిర్మించారు.దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా వెల్లడిస్తామని ఈ సందర్భంగా పృథ్వీ వెల్లడించారు.కమెడియన్ గా పృథ్వీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక నటిగా తన కూతురు ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు