కాఫీ పొడితో ఫేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో తెలుసా?

చాలా మంది ఉదయం లేవగానే కాఫీ పడందే మంచం దిగరు.అలాగే కాఫీ త్రాగనిదే ఏ పని చేయాలని అనిపించదు.

అలాంటి కాఫీతో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? కాఫీలో ఉండే కెఫీన్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాన్ వంటి వాటిని తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.పేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ కలబంద జ్యుస్ ని కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోతాయి.

Coffee Scrub And Face Mask Recipe For Glowing Skin Details, Coffee Powder, Coff

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ పంచదార,రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి.దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.

Advertisement
Coffee Scrub And Face Mask Recipe For Glowing Skin Details, Coffee Powder, Coff

ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిముషాలు సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయాలి.15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే ప్రకాశవంతంగా మెరుస్తుంది.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ కాఫీ పొడిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు