లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భయంకరమైన షాకిచ్చిన పోలీసులు.. ?

ప్రజల శ్రేయస్సు, కోరి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ లాక్‌డౌన్ వల్ల కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతుంది.కానీ పేదవారు పడే కష్టాలు మాత్రం అంతా ఇంతా కాదు.

ఇక అందరు కరోనా నిబంధనలు పాటించాలని తీవ్రంగా ప్రచారం చేస్తున్నా కొందరు ఆకతాయిలు అనవసరంగా రోడ్డెక్కుతూ లేని పోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తుండగా కొందరు మాత్రం అసలు భయ పడకుండా పోలీసులకే భయాన్ని పరిచయం చేస్తున్నారు.

ఇలాంటి వారిని కొడితే లాభం లేదని అనుకున్న పోలీసులు ఎవ్వరు ఊహించని షాక్ ఇచ్చారు.కరోనా నిబంధనలు పాటించని వారిని ఐసోలేషన్ కేంద్రాలకు పంపించారు.

Advertisement

ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీలో జరిగింది.ఇప్పటి వరకు కేసులు, జరిమానాలు అంటూ సర్ది చెప్పిన పోలీసులు కొత్తగా ఈ నిర్ణయం తీసుకోవడం సూపర్ అంటూ ఆకతాయిల దూల తీరడం ఖాయం అంటూ నెటిజన్స్ మెచ్చుకుంటున్నారట.

రీల్ కోసం ప్రాణాల‌తో చెల‌గాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!
Advertisement

తాజా వార్తలు