మెదక్ జిల్లా రుక్మాపూర్‎లో ఉద్రిక్తత

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రుక్మాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రుక్మాపూర్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో పక్కనే ఉన్న బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిపై దాడికి పాల్పడ్డారు.

అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పర దాడులకు ప్రయత్నించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.దీంతో రుక్మాపూర్ లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు