కర్నూలు జిల్లా ఆదోనిలో టెన్షన్..టెన్షన్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘యువగళం ’ పాదయాత్రను వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

రాయలసీమ ద్రోహీ నారా లోకేశ్ ఆదోనికి రావొద్దంటూ నినాదాలు చేశారు.కర్నూలులో హైకోర్టుకు టీడీపీ మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను అడ్డుకున్నారు.

రెండు పార్టీ శ్రేణులకు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోవడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.ఈ నేపథ్యంలో ఆదోనీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు