Telugu NRI News Roundup : తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.  లాస్ట్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడు నియామకం

అమెరికాతో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు ఎన్ఆర్ఐ టిడిపి కమిటీలను ప్రకటించింది.

ఈ మేరకు లాస్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడిగా వెంకట్ ఆళ్ల నియమితులయ్యారు. 

2.స్వలింగ పెళ్లిళ్లకు అమెరికా ఆమోదం

  స్వలింగ పెళ్లిళ్లకు అమెరికా ఆమోదం తెలిపింది.బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సంతకం పెట్టారు.దీంతో బిల్లు చట్టబద్దం అయ్యింది. 

3.స్పేస్ ఎక్స్ జాబిల్లి యాత్రకు భారత నటుడి ఎంపిక

  స్పేస్ ఎక్స్ జాబిల్లి యాత్రలో ప్రయాణించే అవకాశం భారత్ కు చెందిన నటుడు బాల్ వీర్ ఫేమ్ దేవ్ జోషికి లభించింది. 

4.భారత్ పై వైట్ హౌస్ అధికారి ప్రశంసలు

  ప్రపంచంలో భారత్ ఎదుగుదలపై అమెరికా వైట్ హౌస్ స్పందించింది.అమెరికాకు భారత్ మిత్ర దేశంగా ఉందని సూపర్ పవర్ గా భారత్ .మరో అగ్రరాజ్యంగా మారుతుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

5.న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే ప్రకటించిన ప్రాన్స్ అధ్యక్షుడు

 ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ విప్లవత్మక నిర్ణయం తీసుకున్నారు దేశంలోని 18 నుంచి 20 ఏళ్ల లోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

6. పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా జెలెన్స్కి

Advertisement

 ఉక్రేన్ అధ్యక్షుడు జెలెన్స్కి 2022 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. 

7.పాక్ లో కాల్పులు .ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భద్రత పెంపు

  సుదీర్ఘ విరామం తరువాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు బస చేసిన హోటల్ కు సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ కు భారీగా భద్రత పెంచారు.

ఇంగ్లాండ్ ఆటగాళ్ళు బస చేసిన హోటల్ కు ఒక కిలో మీటర్ దూరంలో తుపాకీ కాల్పుల శబ్దం రావడం తో భద్రతా అధికారులు అప్రమత్తం అయ్యారు.   .

Advertisement

తాజా వార్తలు