తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన

ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు ఆపరేషన్ గంగ ద్వారా 15,900  మందిని ఉక్రెయిన్ నుంచి భారత్ కు తరలించినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.

2.కమర్షియల్ వీసాల పై కువైట్ కీలక నిర్ణయం

కమర్షియల్ వీసాల పై కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.కమర్షియల్ వీసాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

3.హత్య కేసులో భారతీయుని అరెస్ట్

ఈ నెల 4న కువైట్ లోని ఆర్ధియా లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కువైటీలను హత్య చేసిన కేసులో భారత్ కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే అతడి వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.

4.8 నుంచి అంతర్జాతీయ విమాన రాకపోకలు నిషేధం

ఈ నెల 8 నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు రష్యన్ ఎయిర్ లైన్స్ ఏరో ఫ్లోట్ ప్రకటించింది.అయితే ఎయిర్ ఇండియా విమానాలు కు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

5.తానా ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు

అమెరికాలోని డల్లాస్ లో తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో పలువురు తెలుగు విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించారు.

6.భారత్ సాయం కోరిన ఉక్రెయిన్

Advertisement

రష్యా మరోసారి ఉక్రెయిన్ పై దాడులు ముమ్మరం చేసిన క్రమంలో భారత్ సాయాన్ని ఉక్రెయిన్ కోరింది.తమ దేశంపై దాడులు జరగకుండా రష్యాను ఓపెన్ చేయాలా భారత్ చొరవ తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

7.యుద్ధంలో 11 వేల మంది రష్యన్ సైనికులు మృతి

ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగిన యుద్ధంలో ఇప్పటివరకు 11 వేల మంది రష్యన్ సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

8.బైడన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఫోన్ చేశారు.ఉక్రెయిన్ ఆర్థిక, భద్రత, సహకారం, రష్యా పై ఆంక్షలు కొనసాగింపు వంటి వ్యవహారాలపై బైడన్ తో ఎలన్ స్కి ఫోన్ ద్వారా చర్చించారు.

9.ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు స్పందన

ఉక్రెయిన్ పై దాడికి రష్యన్ బలగాలను పంపడం ముమ్మాటికీ కఠిన నిర్ణయం అని, ఇది అనివార్యమైన ఘటన అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement
" autoplay>

తాజా వార్తలు