తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.చైనాలో భారత రాయబారిగా ప్రదీప్ కుమార్

చైనా లో భారత రాయబారిగా సీనియర్ దౌత్య వేత్త ప్రదీప్ కుమార్ రావత్ నియమితులయ్యారు.

2.డల్లాస్ లో నాట్స్ బాలల సంబరాలు

డల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం  (నాట్స్)  ఆధ్వర్యంలో నిర్వహించే బాలల  సంబరాలను డల్లాస్ లోని నాట్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

3.చీలి నూతన అధ్యక్షుడిగా గెబ్రియెల్ బోరిక్

చీలి నూతన అధ్యక్షుడిగా గెబ్రియెల్ బోరిక్ ఎన్నికయ్యారు.

4.కాలిఫోర్నియాలో భూకంపం

కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై 6.2 గా దీని తీవ్రత నమోదయ్యింది.

5. తానా 25 కోట్ల మందుల సాయం

తానా ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కు 25 కోట్ల వైద్య పరికరాలు, మందుల రూపం లో సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది.

6.అమెరికాలో ఒమి క్రాన్

అమెరికాలో తొలి ఒమి క్రాన్ మరణం సంభవించింది.50 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి కి ఈ వైరస్ సోకడం తో అతడు మరణించాడు.

7.కిమ్ మరో దారుణం

Advertisement

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ పౌరులు 7 గురికి ఉరిశిక్ష విధించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.తమ ప్రధాన ప్రత్యర్ధి దక్షిణ కొరియా కు చెందిన వీడియోలు దొంగచాటుగా చూడడమే కాకుండా,  వాటిని దొంగచాటుగా విక్రయించిన నేరానికి ఏడుగురికి మరణ శిక్ష విధించినట్టు ఓ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రకటించింది.

8.నేను బూస్టర్ డోస్ తీసుకున్నా : ట్రంప్

నేను బూస్టర్ డోస్ తీసుకున్నానని, అందరూ ఈ డోస్ తీసుకుని సురక్షితంగా ఉండాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

9.పాకిస్థాన్ లో హిందూ దేవాలయం ధ్వంసం

పాకిస్థాన్ లోని కరాచి లో ఓ గుర్తు తెలియని వ్యక్తి హిందూ దేవాలయంలోకి ప్రవేశించి దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.

10.  వైట్ హౌస్ లో కరోనా కలకలం

అమెరికాలోని వైట్ హౌస్ లో కరోనా కలకలం సృష్టించింది.

గత మూడు రోజులుగా అద్యక్షుడు జో బైడన్ తో ప్రయాణించిన వ్యక్తి కరోనా వైరస్ ప్రభావం కు గురయ్యారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు