తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 22, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.43

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.44

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.7.30 ల8.00

దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 22 Wednesday 2024, M
ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది.కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 22 Wednesday 2024, M
Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 22 Wednesday 2024, M

ఈరోజు అవసరానికి ధన సహాయం అందుతుంది.అనారోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

మిథునం:

ఈరోజు బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

Advertisement

వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం

: ఈరోజు దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి.

ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

సింహం:

ఈరోజు ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.

ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కన్య:

ఈరోజు విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

వృథాఖర్చులు పెరుగుతాయి.దూరప్రయాణ సూచనలున్నవి.

వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.మిత్రులతో కలహాలు సూచనలున్నవి.

తుల:

ఈరోజు ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి తగిన గుర్తింపు పొందుతారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయం పెరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

మకరం:

ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కుంభం:

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన చికాకులు తప్పవు.

మీనం:

ఈరోజు బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.నూతన వాహనయోగం ఉన్నది.స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.

విద్యార్దులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు.

ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

తాజా వార్తలు