చిరంజీవి సోనూ సూద్ ని కూడా తొక్కేస్తాడంటూ ఫైర్ అయిన శ్రీ రెడ్డి...

ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలలో ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు మరియు ఘాటు విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ నటి "శ్రీ రెడ్డి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే గతంలో ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సినిమా పరిశ్రమ బహిష్కరణ విధించింది.

దీంతో అప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి మకాం మార్చింది.అలాగే సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ మెగా హీరోలను బాగానే టార్గెట్ చేస్తోంది.

అయితే తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇందులో భాగంగా శ్రీ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి మరియు టాలీవుడ్ ప్రముఖ విలన్, రియల్ హీరో సోను సూద్ ఫోటోలను జోడిస్తూ చింతచిగురు చేపల పులుసు చేయాలంటే మెగాస్టార్ చిరంజీవిని అడిగి తెలుసుకోండని అలాగే ఈ కరోనా విపత్కర సమయంలో మీకు  ఏదైనా సహాయం కావాలంటే సోనూసూద్ ని అడగండని పేర్కొంది.

అంతటితో ఆగకుండా సోనూసూద్ ని చిరంజీవి తన పలుకుబడితో ఎక్కడ తొక్కేస్తాడో అని తనకు భయంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు శ్రీ రెడ్డిని ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవలే 10 కోట్ల రూపాయల విలువ చేసే ఆక్సిజన్ సిలిండర్లను కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారి కోసం ఏర్పాటు చేశాడని కాబట్టి సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి ఓ వ్యక్తి పై ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

మరికొంతమంది మాత్రం సోనూ సూద్ మరియు చిరంజీవి అభిమానుల మధ్య చిచ్చు పెట్టేందుకు శ్రీ రెడ్డి ప్రయత్నిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ మధ్య శ్రీ రెడ్డి వైకాపా పార్టీతో విభేదాలు వచ్చి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది.ఆమధ్య అసభ్యకరంగా చిత్రీకరించిన ఫోటోలను కూడా తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, కించ పరచడం వంటి వాటిని చేయడంతో ఇటీవలే ఈ అమ్మడిపై జనసేన పార్టీ మహిళా విభాగం కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు