ఆటో నడిపిన తెలుగు నటి... దాంతో నెటిజన్లు...

తెలుగులో అక్క, అమ్మ, చెల్లి, తదితర పాత్రల్లో నటించి సినీ ప్రేక్షకులను తన సెంటిమెంటల్ నటనతో ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ "ప్రగతి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి ప్రగతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఆరోగ్యపరమైన చిట్కాలు మరియు యోగాకి సంబంధించిన చిట్కాలు వంటివి షేర్ చేస్తూ బాగానే ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే తాజాగా ప్రగతి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఆ వీడియోలో ఏముందంటే నటి ప్రగతి ఓ ఆటో నడుపుతూ కనిపించింది.

అంతేకాక ఇలాంటి అవకాశం వస్తే ఎప్పుడు వదులుకోకండని క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో కొందరు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.

అంతే గాక నిజంగానే ప్రగతి నిజంగానే ఆటో నడిపిందా లేక ఏదైనా సినిమా షూటింగ్ కోసం ప్రయత్నించారా.? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే ప్రగతి ఈ వీడియో ని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 10 వేల మందికి పైగా లైకులు వచ్చాయి.

Telugu Actress Pragathi Auto Driving Video Viral, Pragathi, Telugu Actress, Pra
Advertisement
Telugu Actress Pragathi Auto Driving Video Viral, Pragathi, Telugu Actress, Pra

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో నటి ప్రగతి అప్పుడప్పుడు పలు పాటలు కి డాన్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తోంది.దీంతో ఈ అమ్మడికి రోజురోజుకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.కాగా ప్రస్తుతం నటి ప్రగతి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 2 లక్షల 77 వేల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో నటి ప్రగతికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియూ క్రేజ్ గురించి.కాగా ప్రస్తుతం నటి ప్రగతి తెలుగులో అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటిస్తున్న"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు