మంత్రి హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం.. !!

ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని సమాచారం.

కాగా ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఫోగ్రాం ముగిసిన తర్వాత మంత్రి హరీష్ రావు కాన్వయిలో తిరిగి హైదరాబాద్ బయల్దేరి వస్తున్న సమయంలో కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఓ అడవిపంది ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చిందట.

Telangana Minister Harish Rao Narrowly Missed Accident Telangana Minister, Haris

దీంతో ఆ కాన్వాయ్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడటంతో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయట.ఈ ఘటనలో హరీష్ రావు గన్‌మెన్ కు స్వల్పగాయాలు అవగా అతన్ని ఆస్పత్రికి పంపించి మరో కారులో హరీష్ హైదరాబాద్‌కు బయలు దేరారట.

మొత్తానికి హరీష్ రావు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారన్నమాట.

Advertisement
అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు

తాజా వార్తలు