తగ్గిన 'బండి ' స్పీడ్ ! కేంద్రం నిర్ణయాలతో ట్రబుల్స్ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ తన సత్తా చాటుకుంది వచ్చింది ఇటీవల జరిగిన ఎన్నికల తో పాటు అంతకు ముందు జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటుతోంది.2023 ఎన్నికలలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుందని తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం అని అభిప్రాయపడ్డారు దీనికి తగ్గట్టుగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, బీజేపీ తెలంగాణలో బలమైన పార్టీగా ముద్ర వేసుకుంది.

ఇక బండి సంజయ్ సైతం తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్తూ, సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తుండే వారు.

కానీ, ఇప్పుడు మాత్రం బండి సంజయ్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.పూర్తిగా ఆయన సైలెంట్ అయినట్టు గా కనిపిస్తున్నారు.దీనికి కారణం కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు పెట్రోల్ డీజిల్ తో పాటు అన్నిటిలోనూ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుండడంతో పాటు , పెద్ద ఎత్తునప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది బీజేపీ కంటే కాంగ్రెస్ పాలనే నయం అన్నట్లుగా జనాల్లో అభిప్రాయం కలగడం, ఇలా అనేక కారణాలు తెలంగాణలోని బీజేపీ టిఫిన్ పడుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేసే అది తమ ఖాతాలో వేసుకుందాము అంటే కేంద్రం నిర్ణయాలతో ఆ విధంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఇప్పటివరకు బీజేపీలో చేరదామని అనే ఆలోచనతో ఉన్న ఇతర పార్టీల నాయకులు సైతం ప్రస్తుత పరిస్థితులను చూసి వెనకడుగు వేస్తున్నారట.కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ బీజేపీ అనేక రకాలు గా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.వీటి కారణంగా బండి సంజయ్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్టుగా కనిపిస్తోంది.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు