టి.కాంగ్రెస్ తొలి జాబితా ఇదేనా ..?

కొద్ది రోజులుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయగా.

ఆ విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది.దీనికి కారణం మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కాకపోవడమే కారణంగా తెలుస్తోంది.

అందుకే.కాంగ్రెస్ పార్టీ నవంబర్ రెండో తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది.

ఇప్పటికే ఈ జాబితాకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.నవంబర్ రెండో తేదీన ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది.

Advertisement

మహాకూటమి(ప్రజా కూటమి)లోని పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా సాగుతున్నాయి.ఈ కూటమిలోని సీట్లను వదిలేసి వివాదాలకు దూరంగా ఉన్నసీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.

ఈ సీట్లకు చెందిన జాబితాకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.

కొడంగల్ - రేవంత్ రెడ్డి, మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి ఆలంపూర్- సంపత్‌కుమార్ పరిగి - రామ్మోహన్ రెడ్డి గజ్వేల్- ఒంటేరు ప్రతాప్ రెడ్డి గద్వాల డీకే అరుణ ఆందోల్- దామోదర రాజనర్సింహ నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి గోషామహల్ - ముఖేష్ గౌడ్ నాంపల్లి- ఫిరోజ్ ఖాన్ ఆలేరు- భిక్షమయ్యగౌడ్ వనపర్తి -చిన్నారెడ్డి సిరిసిల్ల కేకే మహేందర్ రె్డ్డి పెద్దపల్లి విజయరమణరావు సనత్ నగర్ -మర్రి శశిధర్ రెడ్డి వికారాబాద్ -ప్రసాద్ కుమార్ సంగారెడ్డి జగ్గారెడ్డి తుంగతుర్తి -అద్దంకి దయాకర్ నాగర్ కర్నూల్- నాగం జనార్ధన్ రెడ్డి మధిర- మల్లు భట్టి విక్రమార్క ఆసిఫాబాద్- ఆత్రం సక్కు మంథని- శ్రీధర్ బాబు జగిత్యాల -జీవన్ రెడ్డి హూజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి నకిరేకల్- చిరుమర్తి లింగయ్య జనగామ -పొన్నాల లక్ష్మయ్య నర్సంపేట -దొంతిమాధవరెడ్డి భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ నాగార్జునసాగర్ -జానారెడ్డి ఖానాపూర్ -రమేష్ రాథోడ్ బోథ్ -సోయం బాపురావు జహీరాబాద్ -గీతారెడ్డి షాద్‌నగర్ - చెవులపల్లి ప్రతాప్ రెడ్డి నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి బాల్కొండ -అనిల్ కుమార్ కామారెడ్డి- షబ్బీర్ అలీ బోధన్- సుదర్శన్ రెడ్డి.

పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!
Advertisement

తాజా వార్తలు