175 నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం తోక ముడవాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ఆదివారం ఆయన విలేకరులకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.
చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు వెళితే వైసీపీ నాయకులు అనేక అరాచకాలు సృష్టించారు.ఇది చాలా బాధాకరం.
తన సొంత నియోజకవర్గంలో ఎందుకు ఆటంకపరిచారు? ఏమవసరం? అన్నా క్యాంటిన్ ఒక మంచి కార్యక్రమం.పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్నది చంద్రబాబు ఆశయం.
దాన్ని తీసేశారు.చంద్రబాబునాయుడు తన సొంత నిధులతో అన్నా క్యాంటిన్లను పెడితే పోలీసు సపోర్టుతో ధ్వంసం చేయడం అన్యాయం.
కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉండి అందుకు సహకరించారు.కుప్పంలో పోలీసులే రౌడీ మూకలతో కలిసి అన్యా క్యాంటిన్ ను ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.టీడీపీ నాయకులను నియోజకవర్గాలలో తిరగనివ్వరా? ఏమిటీ ఈ దౌర్జన్యం? ముఖ్యమంత్రి ఈ శాడిజాన్ని దూరం చేసుకోవాలి.దౌర్జన్యం చేసినవారిని వదిలేసి అమాయకులపై కేసులు పెట్టడం అన్యాయం.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది చెబితే అది కుప్పంలో అమలౌతోంది.ఐపీఎస్ ఆఫీసర్ కూడా వారికి సలాం కోట్టాల్సిందే.
తెలుగుదేశం కార్యకర్తలపైన్నే కేసులు పెట్టడం విడ్డూరం.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక అరాచక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది.ప్రధాని, నాయకులు మనది ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెబుతుంటారు.
ఎక్కడ ప్రజాస్వామ్యం? అన్ని పార్టీలవారు ఇది గమనించాలి.మూడు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అనేక దౌర్జన్యాలు జరిగాయి.
అనేక మందిపై దాడులు జరిగాయి.ఇండ్లల్లోకి వచ్చి దౌర్జన్యాలు చేయడం, ఇంటిలోని ఆడవారిని తిట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం జరుగుతోంది.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు.ఘర్షణ ఛానల్లో వెంగళరావు అనే అతను ప్రభుత్వం చేసే తప్పుడు కార్యక్రమాలను ఎత్తి చూపితే అతనిపై దాడి చేస్తారా? స్టేషన్ కు తీసుకెళ్లి బట్టలు ఊడదీసి కొట్టడం అన్యాయం.వైసీపీ నాయకులు ఛానళ్లు పెట్టుకోలేదా? ఎంపీ రఘురామరాజునే కొట్టాము, నీవెంత అంటూ వెంగళరావును బెదిరించడం సబబుకాదు.కోర్టులో మేం కొట్టామని చెబితే నీ రెండు సంవత్సరాల కొడుకును చంపేస్తామని బెదిరించడం ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోంది.
ఇదేనా సీఐడీ వ్యవస్థ అంటే.సీఐడీ ఛీఫ్ సునీల్ వెంగళరావును బెదిరించినట్లు తెలిసి కూడా సీఎం ఊరుకుండడమేంటి? పోలీసులు, సీఐడీలపై ఆధారపడి ప్రభుత్వం పనిచేస్తోంది.టీడీపీలో మంచి కార్యకర్తలున్నారు.
భయపడరు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం పనిచేస్తున్నారంటే అది టీడీపీ గొప్పతనం.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కార్యకర్తలున్నారు.వైసీలో ఉన్న కార్యకర్తలందరూ గూండాలు, రౌడీలు.
పెయిడ్ ఆర్టిస్టుల్లాంటి పెయిడ్ గూండాలు.వారిని చూసి భయపడకూడదు.
ఇన్నాళ్లు ఓపికతో ఉన్నాం.టీడీపీకి ఉన్న లక్షాలాదిమంది కార్యకర్తలు రోడ్డెక్కితే పోలీసులు, సీఐడీ శాఖ కంట్రోల్ చేయగలరా? ముఖ్యమంత్రి తోక ముడవాల్సిందే.టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగితే సీఎం కడపకు పారిపోవాల్సిందే.
ప్రశాంత్ కిశోర్ సర్వేలోనూ, ఇతర సర్వేల్లోను జగన్ గెలవలేడని తేలింది.దీంతో వైసీపీ నాయకులకు పెచ్చెక్కింది.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి 600 మంది పోలీసులుంటేగానీ రాలేడు.పోక పోక పర్యటనకు పోతే రోడ్లన్నీ బంద్ చేయించడం, షాపులన్నీ క్లోజ్ చేయించడం బాధాకరం.
జగన్ ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా పరదాలెందుకు? జగనే పరదా వేసుకుంటే సరి.జగన్ అనే దొంగకు పోలీసులు కాపలా కాయడమా? కార్యకర్తల బలం చూసి జగన్ ఉచ్చ పోయాలి.ఒక్కసారిగా 175 నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యకర్తలందరూ రోడ్డుపైకి వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టాలి.
వచ్చే ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడాలని చూస్తున్నారు.జగన్ కు జనబలం లేదు.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నాయకులపై ఏవిధంగా తిరుగుబాటు చేస్తున్నారో చూస్తున్నాం.పోలీసు, సీఐడీ శాఖలను అడ్డం పెట్టుకొని ఓటింగ్ జరుపుకోవాలని చూస్తున్నారు.
దీన్ని అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం ఖూని అయినట్లే.టీడీపీ కార్యకర్తలందరూ ముందుకొచ్చి ఒక ప్రణాళిక రూపొందించి, చంద్రబాబునాయుడును ఒప్పించి మనబలమేంటో చూపాలి.
జగన్ దౌర్జన్యాలను అడ్డుకోవడానికి అన్ని పార్టీలవారు ముందుకు రావాల్సిన అవసరముందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సూచించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy