శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.

శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పులివెందుల టిడిపి‌ ఇంఛార్జ్ బిటెక్ రవి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామానాయుడు లు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన బిటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ.పవిత్రతకు, ప్రశాంతతకు మారుపేరైన తిరుమల, తిరుపతిని వైసీపి భూకబ్జాకారుల నుండి కాపాడాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.

యువతకి విద్య,ఉపాధి అవకాశాలు లేని పరిస్ధితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందన్నారు.కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, చిరుఉద్యోగులు లందరికి జగన్ పాదయాత్రలో ఉద్యోగ భద్రత కల్పిస్తాంమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు.

నిర్వీర్యంమైన యువత, నిరుద్యోగులు, పట్టభధ్రులు అందరూ టిడిపి అభ్యర్ధిని గెలిపించాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు.విశాఖలో సమ్మెట్ ను ఎలక్షన్ షోగా చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు ఎంతో మంది జైల్ కి వెళ్ళారని, నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇరత రాష్ట్రాలకు వెళ్ళారన్నారు.కియో లాంటి కంపెనీలపై వైసీపి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని,

Advertisement

జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఏపిలో ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని,అదే సమయంలో తెలంగాణలో ఆస్తుల విలువలు గణనీయంగా పెరిగిందన్నారు.ఒకటోవ తారీఖున జీతాలు ఇవ్వక పోవడంతో ఉద్యోగస్తులే ఆందోళన దిగుతున్నారని, అలంటి పరిస్ధితుల్లో జగన్ ను నమ్మి పారిశ్రామిక వేత్తలు వస్తారంటే ఎవరూ కూడా నమ్మే పరిస్ధితుల్లో లేరన్నారు.సమ్మెట్ ఒక ఎన్నికల షోగా ప్రజలంతా భావిస్తున్నారని, వెంకటేశ్వర స్వామి కటాక్షాలతో ఏపికి పూర్వ వైభవం రావాలని, ప్రజలకు, భావితరాలకు మంచి భవిష్యత్తు అందించే చంద్రబాబుపై ఆశీస్సులు అందించాలని స్వామి వారిని వేడుకున్నట్లు బిటెక్ రవి తెలిపారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు