ఉద్యోగాలు ఇప్పిస్తాం అని మోసం చేస్తున్న టీడీపీ నేత !!

పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు వసూలు చేసి మోసగించిన కేసులో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత గండి బాబ్జీ భార్య విజయను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.మరిన్ని వివరాల్లోకి వెళితే, రెండేళ్ల క్రితం సిరిపురం ప్రాంతంలో బాబ్జీ దంపతులు నివాసముండగా, గిరీశం రెడ్డి, గోపిరెడ్డి, అప్పనాయుడు, జగన్నాథరావులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన విజయ, వారి నుంచి రూ.

4 లక్షలకు పైగా తీసుకుని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.విజయ ఆచూకీ తెలియకపోవడంతో బాధితులు అప్పటి పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్ కు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

అప్పటి నుంచి నిందితులపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా, నగరానికి కొత్తగా వచ్చిన కమిషనర్ యోగానంద్ ను శనివారం నాడు ప్రత్యేకంగా కలిసిన బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.వెంటనే స్పందించిన ఆయన ఆదేశాల మేరకు, త్రీటౌన్ పోలీసులు, తన చెల్లెలు ఇంట్లో తలదాచుకున్న విజయను అరెస్ట్ చేశారు.

ఆపై వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నామని పోలీసులు తెలిపారు.కాగా, విజయ గతంలో డీఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

Advertisement
హెచ్‌సీయూపై లెక్కలతో అటాక్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్..

తాజా వార్తలు