Chandrababu : త్వరలో ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) త్వరలో ఢిల్లీకి( Delhi ) పయనం కానున్నారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ( BJP ) ఢిల్లీ పెద్దలు మంతనాలు జరపనున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బీజేపీ జాతీయ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది.

అలాగే ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈనెల 8వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.అయితే ఏపీలో ప్రస్తుతం బీజేపీ -జనసేనతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.అలాగే టీడీపీ -జనసేన( TDP Janasena ) కూడా పొత్తులో ఉంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలు పొత్తులతో ఎన్నికల బరిలో నిలవాలని యోచనలో ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు