Millionaire : మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే.. కచ్చితంగా మీ ఇంట్లో ఈ పనులను చేయండి..!

లక్ష్మీదేవి అనుగ్రహం( Goddess Lakshmi ) కావాలని, అమ్మవారి దయ కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవరూ ఉండరు.ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం అమ్మవారి దయ తమ మీద ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

 If You Want To Become A Millionaire Then Definitely Do These Things In Your Hom-TeluguStop.com

మనం కష్టపడి పని చేయడానికి అమ్మవారి ఆశీస్సులు కావాలి.లక్ష్మీ అనుగ్రహం ఉంటే తప్ప మనం ఆనందంగా ఉండలేమని చాలామంది అనుకుంటూ ఉంటారు.

లక్ష్మీదేవి చల్లని చూపు మనపై ఉండాలని, ఆమె దృష్టి మన పట్ల ఎప్పుడూ ఉండాలని వ్రతాలు, నోములు, దానధర్మాలు చేస్తూనే ఉంటారు.అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ వస్తుందా అంటే మాత్రం రాదు అనే చెప్పాలి.

ఎందుకంటే అందరికీ వస్తే ఈ రోజు ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు.

Telugu Charity, Clean Utensils, Goddess Lakshmi, Millionaire, Noms, Vratas-Lates

కొంతమంది పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మరికొందరు మాత్రం ఆ లక్ష్మీదేవి చల్లని చూపు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ష్మీ దేవి అనుగ్రహం కలగదు.మనం ప్రతి రోజు ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న పనుల మీద కూడా శ్రద్ధ పెడితే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అందరి పై ఉంటుంది.

ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి పూట చాలా తొందరగా భోజనాలు చేసేసి( early dinner ), చాలా తొందరగా నిద్రపోయేటువంటి అలవాటు పూర్వం సమాజంలో ఉండేది.

ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు, పనులు వ్యాపారంలో భాగంగా తినేటటువంటి సమయం, నిద్రపోయే సమయం మారిపోయింది.

Telugu Charity, Clean Utensils, Goddess Lakshmi, Millionaire, Noms, Vratas-Lates

ఇది ఏమాత్రం మంచిది కాదు.అందుకోసం నిద్రపోయేటప్పుడు వంట గదిలో ఖాళీ అయినా పాత్రలను శుభ్రం చేసి నిద్ర పోవాలి.లేదంటే ఆ ఇంటిని దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు.

ఇలా పాత్రలను శుభ్రం చేయడం వల్ల చేసేటువంటి పనులలో విజయం లభిస్తుంది.అలాగే గడపని ఎప్పుడు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పొరపాటున కూడా గడపను తొక్కకూడదు.దాని మీద కూర్చోకూడదు.

అలాగే ఇంట్లో రాత్రిపూట ఎప్పుడూ గొడవలు పడకూడదు.గట్టి గట్టిగా మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఏడవడం లాంటివి ఇంటి ఇల్లాలు అర్ధరాత్రి పూట చేయకూడదు.

చెడు మాటలు, బూతు మాటలు ఇంట్లోనే కాదు ఎక్కడ కూడా ఉపయోగించకూడదు.అలాగే వేరొకరిని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు ఆలోచనలు అసలు చేయకూడదు.

వేరే వారి మీద నిందలు వేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube