బాహుబలి1 కలెక్షన్లను దాటేసిన పొన్నియన్ సెల్వన్.. ఇదే నిజమంటూ?

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాపై విడుదలకు ముందే భారీస్థాయిలో అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా రిలీజైన తర్వాత తొలిరోజు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.తొలిరోజు కలెక్షన్ల విషయంలో బాహుబలి1 సాధించిన రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయడం గమనార్హం.బాహుబలి పార్ట్1 ఫస్ట్ డే కలెక్షన్లు ఏకంగా 73.4 కోట్ల రూపాయలుగా ఉంది.ఈ కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లు కాగా పొన్నియన్ సెల్వన్ అన్ని భాషల్లో ఏకంగా 82.3 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.బాహుబలి1 కలెక్షన్లను పొన్నియన్ సెల్వన్ బ్రేక్ చేయడంతో పొన్నియన్ సెల్వన్ అభిమానులు సంతోషిస్తున్నారు.ఫస్ట్ వీకెండ్ వరకు పొన్నియన్ సెల్వన్ బాగానే కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు 2.5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

 Ponniyan Selwan Movie World Wide First Day Collections Details Here ,ponniyan S-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు ఈ సినిమా హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ విడుదలైతే పొన్నియన్ సెల్వన్ ను పట్టించుకునే ప్రేక్షకులు అయితే ఉండరని చెప్పవచ్చు.

పొన్నియన్ సెల్వన్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

 Ponniyan Selwan Movie World Wide First Day Collections Details Here ,ponniyan S-TeluguStop.com

పొన్నియన్ సెల్వన్1 పాత్రల పరిచయానికే సరిపోయిందని పొన్నియన్ సెల్వన్2 సినిమాలోనే అసలు కథ ఉండనుందని బోగట్టా.మణిరత్నం వేగంగా సినిమాను తెరకెక్కించడంతో క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ కామెంట్ల గురించి మణిరత్నం ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

బాహుబలితో పొన్నియన్ సెల్వన్ ను పోల్చి చూడటం వల్లే ఈ సినిమా చాలామందికి నచ్చలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Video : Ponniyan Selwan Movie World Wide First Day Collections Details Here ,ponniyan Selwan, Mani Ratnam, Kollywood, Aiswarya Rai, Trisha , Vikram, Collections, Jayam Ravi #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube