బాహుబలి1 కలెక్షన్లను దాటేసిన పొన్నియన్ సెల్వన్.. ఇదే నిజమంటూ?

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాపై విడుదలకు ముందే భారీస్థాయిలో అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా రిలీజైన తర్వాత తొలిరోజు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

తొలిరోజు కలెక్షన్ల విషయంలో బాహుబలి1 సాధించిన రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయడం గమనార్హం.

బాహుబలి పార్ట్1 ఫస్ట్ డే కలెక్షన్లు ఏకంగా 73.4 కోట్ల రూపాయలుగా ఉంది.

ఈ కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లు కాగా పొన్నియన్ సెల్వన్ అన్ని భాషల్లో ఏకంగా 82.

3 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.బాహుబలి1 కలెక్షన్లను పొన్నియన్ సెల్వన్ బ్రేక్ చేయడంతో పొన్నియన్ సెల్వన్ అభిమానులు సంతోషిస్తున్నారు.

ఫస్ట్ వీకెండ్ వరకు పొన్నియన్ సెల్వన్ బాగానే కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు 2.5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

తమిళనాడు రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు ఈ సినిమా హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ విడుదలైతే పొన్నియన్ సెల్వన్ ను పట్టించుకునే ప్రేక్షకులు అయితే ఉండరని చెప్పవచ్చు.

పొన్నియన్ సెల్వన్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

"""/"/ పొన్నియన్ సెల్వన్1 పాత్రల పరిచయానికే సరిపోయిందని పొన్నియన్ సెల్వన్2 సినిమాలోనే అసలు కథ ఉండనుందని బోగట్టా.

మణిరత్నం వేగంగా సినిమాను తెరకెక్కించడంతో క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్ల గురించి మణిరత్నం ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బాహుబలితో పొన్నియన్ సెల్వన్ ను పోల్చి చూడటం వల్లే ఈ సినిమా చాలామందికి నచ్చలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన నిందితుడిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!