ఈ పోరాటంలో మేము కూడా మీ వెంటే... చంద్రబాబుకు మద్దతుగా తారకరత్న పిల్లలు!

స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టయి రాజమండ్రి జైలలో ఉన్న సంగతి మనకు తెలిసిందే .

ఈ అరెస్టు పట్ల వ్యతిరేకత ఏర్పడటంతో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు.

ఇలా చంద్రబాబు నాయుడుని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని త్వరలోనే ఈయన నిర్దోషిగా బయటకు వస్తారు అంటూ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఈ అరెస్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తున్నారు.ఇకపోతే ఈ అరెస్టు విషయంపై ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.

Tarakaratna Kids Support To Chandrababu Photos Goes Viral, Chandrababu, Tarakara

ఇక తాజాగా నందమూరి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి తారకరత్న ( Tarakaratna ) కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై స్పందిస్తూ వారికి మద్దతు తెలియజేశారు.నందమూరి వారసుడిగా తారకరత్న అందరికీ ఎంతో సుపరిచితమే అయితే ఈయన తన తాతయ్య స్థాపించినటువంటి పార్టీ కోసం కష్టపడతానని ప్రజలకు సేవ చేయడానికి తను కూడా భాగమవుతాను అంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు.అయితే లోకేష్( Lokesh ) పాదయాత్రలో పాల్గొని ఆయనకు మద్దతు తెలియజేసినటువంటి తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణించారు.

Tarakaratna Kids Support To Chandrababu Photos Goes Viral, Chandrababu, Tarakara

ఇలా తారకరత్న మరణించడంతో నందమూరి నారా కుటుంబాలు ఆయన కుటుంబానికి చాలా మద్దతు తెలియజేశాయి.అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తారకరత్న పిల్లలు ( Tarakaratnar Kids ) చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేస్తూ ఉన్నటువంటి ప్లకార్డులను చేతిలో పట్టుకొని ఈ పోరాటంలో మేము కూడా మీ వెంటే అంటూ చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేశారు.దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Tarakaratna Kids Support To Chandrababu Photos Goes Viral, Chandrababu, Tarakara

చిన్నపిల్లలు అయినా తమ బాధ్యతగా చంద్రబాబు నాయుడు అరెస్టుకి మద్దతు తెలుపుతున్నారని కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం బాబు గారి అరెస్టు విషయంపై మౌనం వహిస్తూనే ఉన్నారు అంటూ పరోక్షంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను ఉద్దేశిస్తూ పోస్టులు చేస్తున్నారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు