టాలీవుడ్ లో పెరిగిన తమిళ దర్శకుల హవా !

బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ రూపురేఖలు మారిపోయాయి.తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధిస్తున్నాయి.

అందుకే మన స్టార్ హీరోలు అంతా కూడా బిజీబిజీగా స్టార్ దర్శకులతో కనెక్ట్ అయిపోయి సినిమాలు తీస్తున్నారు.అయితే మిగిలిన హీరోలు సినిమాలు చేయాలంటే దర్శకుడు దొరకని పరిస్థితి.అందుకే కొంత మంది హీరోలు తమిళ దర్శకుల వెనకాల పడ్డారు.90% విజయాలతో ఉన్న తెలుగు హీరోలను డైరెక్ట్ చేస్తే తమిళ దర్శకులకు సైతం హిట్టు పడుతుంది అనే నమ్మకంతో ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయడానికి ఈ సిద్ధమవుతున్నారు తమిళ దర్శకులు.కేవలం దర్శకులు మాత్రమే కాదు మన తెలుగు దర్శకులు బయట హీరోలను నేరుగా మన తెలుగులోకి దింపేస్తున్నారు.

ఇటీవల కాలంలో దుల్కర్ సల్మాన్ సీత రామం సినిమాతో తెలుగులో ఎంత పెద్ద హిట్టు కొట్టారో మనందరికీ తెలిసిందే.మరి అలా తెలుగులో బిజీగా ఉన్న ఆ తమిళ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మోహన్ రాజా

చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.అందుకే మోహన్ రాజా అనే తమిళ దర్శకుడిని తెలుగులో పరిచయం చేస్తూ గాడ్ ఫాదర్ అనే సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టారు.వాస్తవానికి మలయాళ సూపర్ హిట్ సినిమా అయినా లూసిఫర్ కి ఇది రీమేక్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మోహన్ రాజా ఈ సినిమాను బాగానే ప్రజెంట్ చేశాడు.

Advertisement

ఈ సినిమా ప్రష్టుతం మంచి కలెక్షన్స్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది.ఇక మోహన్ రాజా నెక్స్ట్ నాగార్జునతో, అఖిల్ తో రామ్ చరణ్ తో సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించాడు.

దర్శకుడు శంకర్

దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో RC15 గా పిలువబడుతున్న ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి.

సముద్రఖని

నటుడు మరియు దర్శకుడైన సముద్రఖని స్వీయ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.రాజకీయాలు మరికొన్ని రోజుల్లో వేడెక్కే వాతావరణం కనిపిస్తూ ఉండడంతో కమిట్ అయినా అన్ని సినిమాలను త్వర త్వరగా పూర్తిచేసే పనిలోపడ్డాడు పవన్ కళ్యాణ్.అయితే ఈ మధ్యకాలంలోనే సముద్రఖనికి కొన్ని డేట్స్ కూడా ఇచ్చారట.

హరి

తమిళ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు హరి.గోపీచంద్ హీరోగా తెలుగులో ఓ సినిమా తీయబోతున్నాడు.హరి చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన గోపీచంద్ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడట.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

బాలాజీ మోహన్

ఇప్పటికే కెరియర్ లో ఎంతోమంది తమిళ దర్శకుల దగ్గర పనిచేశాడు హీరో రవితేజ.ఇప్పుడు దర్శకుడు బాలాజీ మొహాన్ తో ఒక సినిమాలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా లాంచ్ కానుందట .

Advertisement

విఐ ఆనంద్

తమిళ దర్శకులతో ఎక్కువగా పని చేసే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు.ఇటీవల కాలంలో టైగర్ అనే సినిమాలో కూడా నటించినా సందీప్ కి మంచి పేరు వచ్చింది.ఆ సినిమా దర్శకుడితో మరోసారి కలిసి పని చేయబోతున్నాడు సందీప్.

వెంకట్ ప్రభు మరియు అట్లి

దర్శకుడు ఎవరైనా సరే టాలెంట్ ఉంటే అవకాశం ఇచ్చే అక్కినేని హీరోలలో నాగచైతన్య ముందుంటాడు.ప్రస్తుతం తమిళ దర్శకుడైన వెంకట్ ప్రభు తో సినిమా చేస్తుండగా, మరో సినిమా అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఆ తర్వాత తమిళ డైరెక్టర్ శివ తో కూడా ఓ సినిమా చేయడానికి తెలుస్తోంది.

తాజా వార్తలు