విశాఖ మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ

విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ( TDP )సీటుపై ఉత్కంఠ నెలకొంది.

మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్( NRI Paila Prasad ) కు పార్టీ అధిష్టానం కేటాయించింది.

అయితే నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తి( Bandaru Satyanarayana Murthy ) అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీపై బండారు సత్యనారాయణ మూర్తి సముఖంగా లేరని సమాచారం.మరోవైపు టీడీపీ అధిష్టానం వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు( Former MLA Gavireddy Ramanaidu ) సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అభ్యర్థి పైలా ప్రసాద్ కు వ్యతిరేకంగా రామానాయుడు వర్గీయులు భారీగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ అభ్యర్థి మార్పు ఉంటుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు