సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party ) కష్టాల్లో మునిగిపోయింది.ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) అరెస్ట్ తో ఢిల్లీ మరియు పంజాబ్ లోని పలువురు నేతలు ఆప్ ను వీడుతున్నారు.
దీంతో ఆప్ కు రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా ఇప్పటికే పంజాబ్ లో ఆప్ కి రాజీనామా చేసిన ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, ఎమ్మెల్యే శీతల్ అంగురల్( MLA Sheetal Angural ) బీజేపీ గూటికి చేరారు.లిక్కర్ స్కాం కేసు ఆప్ లో సంక్షోభానికి దారి తీసింది.
అదేవిధంగా పలువురు నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.