నా కుమారుడి చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు: సుశాంత్ తండ్రి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి అందరికి తెలిసిందే.

గతంలో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడగా ఇప్పటివరకు ఆయన మరణం పై ఎటువంటి క్లారిటీ రాలేదు.

అంతేకాకుండా ఆ సమయంలో సుశాంత్ మరణం పై దర్యాప్తు చేసిన క్రమంలో మరో బాలీవుడ్ డ్రగ్స్ విషయం కలకలం రేపింది.ఇక ఈయన మరణం పై కొన్ని అనుమానాలు కూడా ఎదురవగా.

కేవలం బాలీవుడ్ లో ప్రతిభ తో కాకుండా బంధుప్రీతి వాళ్ల పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తేలింది.ఇక ఇప్పటికి ఈయన మరణం పై కోర్టులో కేసు నడుస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.సుశాంత్ సింగ్ జీవితంపై బాలీవుడ్ లో రెండు మూడు బయోపిక్ లు వస్తున్నాయని, వీటిని నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు.

Advertisement

తన కొడుకు మరణాన్ని పలు నిర్మాణ సంస్థలు గ్యాస్ చేసుకోవాలనుకుంటున్నాయని ఆయన తెలిపారు.

అంతే కాకుండా దీని వల్ల తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు.ఇక దీంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాడేనని వినిపించగా.సుశాంత్ కేసు ఇంకా పెండింగ్ లో ఉందని, బయోపిక్ కూడా చేస్తే కేసుపై ప్రభావం చూపుతాయని, సుశాంత్ కేసు పై సిబిఐ దర్యాప్తు చేస్తుందని, తీర్పు ఇంకా పెండింగ్ లో ఉందని న్యాయవాది తెలిపారు.

అంతేకాకుండా బయోపిక్ పేరుతో రానున్న మూడు సినిమాల గురించి ప్రస్తావించి, కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాను తీస్తున్నారని తెలిపాడు.న్యాయవాది వాదనలు విన్న తర్వాత కోర్టు సుశాంత్ బయోపిక్ సినిమాను నిలిపివేయాలని నిర్మాతలకు ఉత్తర్వులు జారీ చేశారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు