సౌత్ ఆఫ్రికా టూర్ లో విరాట్ కోహ్లీ రికార్డు పై కన్నేసిన సూర్య కుమార్ యాదవ్..!

భారత జట్టు దక్షిణాఫ్రికా టూర్ కు సిద్ధమైంది.దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే.

సూర్య కుమార్ యాదవ్ కు 360 డిగ్రీ ప్లేయర్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది.టీ20 ఫార్మాట్లో ఫుల్ ఫామ్ కొనసాగించి, సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ముందుకు దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.ఆ రికార్డు ఏమిటో చూద్దాం.టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli )భారత తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.56 టీ20 ఇన్నింగ్స్ లలో 2000 పరుగులు చేసి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.ప్రస్తుతం ఈ రికార్డును సూర్య కుమార్ యాదవ్ బ్రేక్ చేయాలంటే.మరో 15 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.55 టీ20 ఇన్నింగ్స్ లలో 1985 పరుగులు చేసిన సూర్య, 2000 పరుగులు పూర్తి అవ్వడానికి మరో 15 పరుగులు జోడించాల్సి ఉంది.

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్( South Africa vs India ) మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ లో సూర్య 15 పరుగులు చేస్తే.భారత్ తరపున అత్యంత వేగవంతంగా టీ20 క్రికెట్లో 2000 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేయవచ్చు.అంతర్జాతీయ పరంగా టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్( Babar Azam ) అగ్రస్థానంలో ఉన్నాడు.

52 టీ20 ఇన్నింగ్స్ లలో బాబర్ 2000 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.ఈ జాబితాలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్( Mohammad Rizwan ) 52 టీ20 ఇన్నింగ్స్ ల ద్వారా రెండు వేల పరుగులు పూర్తి చేసి రెండవ స్థానంలో ఉన్నాడు.ఈ జాబితాలో భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 56 టీ20 ఇన్నింగ్స్ ల ద్వారా 2000 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నాడు.

సూర్య కుమార్ యాదవ్ మరో 15 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ రికార్డు సమం అవుతుంది.

Advertisement
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

తాజా వార్తలు