ఆ మెగా హీరోతో సురేందర్ రెడ్డి..!

సైరా సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ సినిమా చేశాడు.

ఈ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

ఏజెంట్ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఏజెంట్ ఫ్లాప్ అవడం వల్ల సురేందర్ రెడ్డి కి ఛాన్స్ ఇచ్చే హీరో లేకుండా పోయాడు.స్టార్ హీరోలెవరు ఇప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా చేయాలనే సాహసం చేయలేరు.

అందుకే యువ హీరోలతో సినిమాకు రెడీ అవుతున్నాడు సురేందర్ రెడ్డి.

Surendar Reddy Next Movie Hero Finalised, Surendar Reddy , Uppena, Vishnav Teja

తెలుస్తున్న సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి( Surendar Reddy ) తన నెక్స్ట్ సినిమా హీరోని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.అతనెవరో కాదు మెగా హీరో వైష్ణవ్ తేజ్.చరణ్ తో ధృవ తర్వాత సైరా ఛాన్స్ అందుకున్న సురేందర్ రెడ్డి ఆ తర్వాత అఖిల్ సినిమా చేశాడు.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ అవడం సురేందర్ రెడ్డి కెరీర్ మీద ఆ ఎఫెక్ట్ పడేలా చేసింది.సురేందర్ రెడ్డి ఈసారి కూడా వక్కతం వంశీ కథ మీద డిపెండ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

Advertisement
Surendar Reddy Next Movie Hero Finalised, Surendar Reddy , Uppena, Vishnav Teja
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు