తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త గా సునీల్ ..? 

అన్ని పార్టీలు వ్యూహ కర్తలను నియమించుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో, తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది.

తెలంగాణలో బలంగా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్, అధికారం కోసం గట్టిగా పోటీ పడుతున్న బీజేపీని ఎదుర్కుంటూ ముందుకు వెళ్లాలంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యూహాలు ఏమాత్రం పని చేయవని అధిష్టానం కాస్త ఆలస్యంగా గుర్తించింది.

దీనికి తోడు పార్టీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు రోజు రోజుకు పెరిగి పోతూ ఉండడంతో, తెలంగాణ కాంగ్రెస్ కు ఒక వ్యూహ కర్తను నియ మించిందట.ఆయన పేరు సునీల్ కానుగోలు.

ఈయన గతంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీమ్ లో కీలకం గా పనిచేశారు.ఆ తరువాత ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి తమిళనాడులోని అన్నాడీఎంకే వంటి పార్టీలకు వ్యూహకర్తగా పని చేశారు.

ఈ మేరకు సునీల్ తో ఏఐసిసి లోని కీలక నేత సమక్షంలో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే సునీల్ తన టీమ్ తో తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసేందుకు రంగంలోకి దిగబోతున్నారట.

Advertisement
Sunil As Telangana Congress Strategist Telangana Congress, Suneel Kanugolu, Bjp,

ఈయన కేవలం తెలంగాణ కాంగ్రెస్ కు మాత్రమే కాకుండా కర్ణాటక కాంగ్రెస్ కు వ్యూహాలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.ఈయన గతంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ,కర్ణాటక ఎన్నికల సమయంలో బిజెపి కి వ్యూహాలు అందించడంలో కీలకంగా పని చేశారు.

సునీల్ ఏపీకి చెందిన వ్యక్తి.  కాకపోతే చాలా కాలం క్రితమే చెన్నైలో స్థిరపడ్డారు.

అక్కడ అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

Sunil As Telangana Congress Strategist Telangana Congress, Suneel Kanugolu, Bjp,

అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు.ఇక తెలంగాణ అధికార పార్టీకి రాజకీయ వ్యూహాలు రూపొందించేందుకు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ శిష్యుడు సునీల్ రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.ఈయన రాకతో అయినా తెలంగాణ కాంగ్రెస్ కు మహర్దశ వస్తుందో లేదో చూడాలి.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు