మోహన్ బాబు తో నటించద్దు అన్నది ఎవరు ?

డైలాగ్ కింగ్ గా పేరు సంపాదించిన మోహన్ బాబు తెలుగులో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు.

ఆయనకు సమయపాలన పట్ల ఎంతో కచ్చితత్వం ఉండేది.

టైం అంటే టైంకి రావాల్సిందే.అంతేకాదు డిస్సిప్లేన్ కు మారుపేరు మోహన్ బాబు.

ఆయనకు కోపం కూడా ఎక్కువగానే ఉండేది.దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు కొందరు హీరోయిన్లు భయపడే వారనే వార్తలు అప్పట్లో వచ్చాయి.

అలాగే అలనాటి మేటినటి సుమలతకు కూడా మోహన్ బాబుతో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.అయితే తనతో సినిమాలు అంటే కష్టం.

Advertisement
Sumalatha About Mohan Babu And Movies, Mohan Babu , Ambareesh, Sumalata Husband

మరోసారి ఆలోచించు అని చెప్పారట తన ఫ్రెండ్స్ అయిన హీరోయిన్లు కొందరు.కానీ వారి మాటలను సుమలత పట్టించుకోలేదట.

మోహన్ బాబుతో కలిసి సుమారు 10 సినిమాల్లో నటించిందట.మోహన్ బాబు అంటే చాలా మంది భయపడతారేమో కానీ తాను మాత్రం ఆయనతో నటించడాన్ని ఎంజాయ్ చేసినట్లు చెప్పింది.

అంతేకాదు తను బెస్ట్ ఫ్రెండ్ అయినట్లు వెల్లడించింది.అటు తనకంటే ముందే తన భర్త అంబరీష్ తో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉన్నట్లు వెల్లడించింది.

అందుకే తనతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించినట్లు వెల్లడించింది.తనతో ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ కాలేదని చెప్పింది సుమలత.

Sumalatha About Mohan Babu And Movies, Mohan Babu , Ambareesh, Sumalata Husband
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

బెంగళూరులో ఉండే సుమలత ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా.తనకు ఇక్కడ ఏమైనా హెల్ప్ కావాలన్నా తొలుత మోహన్ బాబుకే ఫోన్ చేస్తుందట.అంతేకాదు సుమలత ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మోహన్ బాబు ఫ్యామిలీ అంతా వెళ్తుందట.

Advertisement

అటు మోహన్ బాబు ఇంట్లో ఏ వేడుక జరిగినా సుమలత కుటుంబ సభ్యులు హాజరవుతారట.తాజాగా సుమలత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.

తన భర్త అంబరీష్ చనిపోయినప్పుడు జరిగిన ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి సుమలత పోటీ చేసింది.అప్పుడు తనను గెలిపించాలని సోషల్ మీడియా ద్వారా మోహన్ బాబు అక్కడి జనాలను కోరాడు.

ఈ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించింది.

తాజా వార్తలు