Sumaiya Tahreem : ఒకేసారి రెండు జాబ్స్.. లక్ష్యం సాధించిన యువతి.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు( Govt Jobs ) ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.

గవర్నమెంట్ జాబ్ పై దృష్టి పెట్టి చాలా సంవత్సరాల పాటు సమయాన్ని వృథా చేసుకున్న వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

అలా ఒకే సమయంలో ఎక్కువ ఉద్యోగాలను సాధించిన యువతులలో సుమయ్య తహ్రీమ్( Sumaiya Tahreem ) ఒకరు.తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలకు( Gadwal ) చెందిన సుమయ్య తహ్రీమ్ తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.

ఎంఎస్సీ బీఈడీ చదివిన తహ్రీమ్ గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఆలోచనతో ఇంటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టారు.డిగ్రీ చదివే సమయం నుంచి బోటనీపై ఎక్కువ ఆసక్తి ఉండేదని ఆమె తెలిపారు.బీఎడ్ లో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంక్, ఎమ్మెస్సీ ఎంట్రన్స్ లో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ సాధించానని తహ్రీమ్ చెప్పుకొచ్చారు.2022 సంవత్సరంలో ఎమ్మెస్సి పూర్తైందని ఆమె కామెంట్లు చేశారు.

గురుకుల నోటిఫికేషన్( Gurukul Notification ) వచ్చిన తర్వాత పేరెంట్స్, ప్రొఫెసర్స్ సహాయంలో శ్రద్ధగా చదివానని ఆమె చెప్పుకొచ్చారు.పీజీటీలో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంక్, గురుకుల ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 83వ ర్యాంక్స్ ఆధించానని సుమయ్య తహ్రీమ్ వెల్లడించారు.సుమయ్య తహ్రీమ్ సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆమె సక్సెస్ స్టోరీ( Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

సుమయ్య తహ్రీమ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు.సుమయ్య తహ్రీమ్ బాల్యం నుంచి కష్టపడి చదవడం వల్లే తన లక్ష్యాన్ని సులువుగా సాధించగలిగారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించడం సాధారణ విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సుమయ్య తహ్రీమ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.సుమయ్య తహ్రీమ్ సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు