Suhas : వామ్మో ..కమెడియన్ అనుకుంటే ఇరగదీస్తున్నాడు..6 సినిమాలు ఒకేసారి

సుహాస్( Suhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన సుహాస్ కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇప్పుడు బ్యాక్ టూ బైక్ సినిమాలు చేస్తున్నారు.

కలర్ ఫోటో సినిమా సుహాస్ కెరీర్ ను మార్చేసింది అనే చెప్పాలి.ఈ సినిమాతో సుహాస్ స్టార్ అయ్యాడు.

ఈ సినిమా సుహాస్ లైఫ్ ని మార్చేసి ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది.హీరోగానే కాదు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు.

హీరోగా కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి.

Advertisement

తాజాగా సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా( Writer Padmabhushan )కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి సుహాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.3 కోట్లతో తీసిన ఈ సినిమా 10 కోట్లు వసూలు చేసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.తక్కువ బడ్జెట్ తో మంచి కథతో తీస్తే ప్రజలు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది.

నిర్మాతలు కూడా మంచి కథలతో సుహాస్ తో చేస్తే లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారు.ఇక నెగటివ్ క్యారెక్టర్ లో కూడా సుహాస్ అదరగొట్టాడు.ఆ తరువాత సుహాస్ ఏ సినిమా చేస్తున్నారు అని అందరు ఆలోచిస్తుండగా తాజాగా వచ్చిన అప్డేట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సుహాస్ చేతిలో ఇప్పుడు 6 సినిమాలు ఉన్నాయంట.

ఆగష్టు 19 సుహాస్ పుట్టినరోజు కావడంతో సుహాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్ నుంచి కొన్ని పోస్టర్లు వచ్చాయి.సుహాస్ కి విషెస్ చెబుతూ టీం పోస్టర్లని విడుదల చేసింది.దీంతో సుహాస్ చేతిలో ఇప్పుడు ఇన్ని సినిమాలు ఉన్నాయా అని అందరు షాక్ అవుతున్నారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

సుహాస్ కూడా మంచి కథలని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.ఇప్పుడు సుహాస్ చేతిలో హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం, ఆనందరావు అడ్వాంచర్స్, కేబుల్ రెడ్డి( cable reddy ), గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు.

Advertisement

సినిమాలు ఉన్నాయి.ప్రతి సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండడంతో సినిమాలపై అంచనాలు ఉన్నాయి.

పెద్ద హీరోల చేతిలో కూడా వరుసగా ఇన్ని సినిమాలు లేవు.ఈ సినిమాలే కాకుండా మరో 10 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్టు సమాచారం.

మొత్తానికి సుహాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలన్నీ విజయం సాధిస్తే త్వరలోనే సుహాస్ కెరీర్ టాప్ గేర్ కి వెళ్తుంది.

తాజా వార్తలు