విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. సూర్యకాంతితో నడిచే బైక్‌కు రూపకల్పన!

ప్రస్తుతం కాలంలో పెట్రోల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి.దీంతో బైక్ బయటకు తీయాలంటేనే జనాలు భయపడుతున్నారు.

పోనీ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ బైక్ కొనాలని కొందరికి ఉంటుంది.అయితే వాటి ధరలు చూసి అవాక్కవుతున్నారు.

ఒకవేళ ఎంతో వెచ్చించి వాటిని కొన్నా, ఇటీవల కాలంలో బ్యాటరీలు పేలిపోతున్నాయి.ఆయా ఘటనల్లో కొందరు చనిపోతున్నారు కూడా.

దీంతో సొంతవాహనంపై బయటకు వెళ్లాలనుకునే వారు ఇరకాటంలో పడుతున్నారు.అటువంటి వారికి ఐఐటీ సాకేత్ విద్యార్థులు గుడ్ న్యూస్ అందించారు.

Advertisement

పెట్రోల్ పోయించుకోకుండా, ఛార్జింగ్ పెట్టకుండా రోడ్లపై పరుగులు తీసే చక్కటి బైక్‌కు రూపకల్పన రూపొందించారు.ఐఐటీ సాకేత్ విద్యార్థులు ఓ అద్భుత ఆవిష్కరణకు నాంది పలికారు.

కేవలం సౌర విద్యుత్‌తో నడిచే ఓ సూపర్ బైక్‌ను తయారు చేశారు.ఓ పాతదైన, పాడైపోయిన బైక్‌‌ను తీసుకున్నారు.

దానికి సోలార్ ప్యానెల్‌ను బిగించారు.బ్యాటరీని కూడా దానికి అమర్చారు.

దీంతో ఎలాంటి ఛార్జింగ్ పెట్టకుండానే ఈ బైక్‌పై మనం ప్రయాణించొచ్చు.కేవలం సూర్యకాంతితోనే ఈ బైక్ నడుస్తుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

దీంతో ఒక్కసారి ఇలాంటి బైక్ కొంటే రూపాయి ఖర్చు పెట్టకుండానే ప్రయాణం చేయొచ్చు.ప్రయాణానికి కొన్ని గంటల ముందు ఎండలో ఉంచితే మరింత బాగుంటుంది.

Advertisement

ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.దీనిని ఐఐటీ సాకేత్ విద్యార్థులు ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు.

దీంతో దీని గురించి అందరికీ తెలిసింది.ఇలాంటి బైక్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐటీఐ సాకేత్ కోఆర్డినేటర్ బనీ సింగ్ చౌహాన్ దీనిపై స్పందించారు.తమ విద్యార్థులు కేవలం 15 రోజుల్లోనే ఈ బైక్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు.

సామాన్యులకు ఉపయోగపడేలా ఇటువంటి బైక్‌లను రూపొందిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.త్వరలోనే దీనికి పేటెంట్ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కేవలం ఎండలో 4 గంటలు ఉంచి, ఆ తర్వాత దీనిపై ప్రయాణించొచ్చన్నారు.

తాజా వార్తలు