ప్రవాస తెలుగు విద్యార్ధి దుర్మరణం.

జమైకాలోని పోర్ట్‌లాండ్‌ ప్రాంతంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఈ ఘటనలో తెలుగు ఎన్నారై విద్యార్ధి మృతి చెందగా మిగిలిన విద్యార్ధులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వివరాలలోకి వెళ్తే.ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్ధి పేరు జాస్తి ప్రంజల్‌(13).

పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు కి చెందినా జాస్తి అశోక్ అనే వైద్యుడు దాదాపు 15 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.అశోక్ కి ఒక భార్య ఇద్దరు పిల్లలు.

భార్య గృహిణి కాగా .పెద్ద కొడుకు జాస్తి ప్రంజల్‌ పోర్ట్‌లాండ్‌ సమీపంలోని టిచ్‌ ఫీల్డ్‌ హైస్కూల్‌లో చదువుతున్నాడు.ప్రంజల్‌ ఈ నెల 20న స్కూలు నుంచి మధ్యాహ్నం అతడు 3 గంటల సమయంలో ఇంటికి వస్తూ ఉండగా మార్గ మధ్యలో అతడు ప్రయాణిస్తున్న స్కూలు బస్సు అనుకోకుండా ప్రమాదానికి గురయ్యింది.

Advertisement
Student Dies In Jamaica Portland Crash-ప్రవాస తెలుగు �

ఈ ఘటనలోనే అతడు ప్రాణాలు వదలగా మరో 23 మంది విద్యార్థులకి స్వల్ప గాయాలు అయ్యాయి.

Student Dies In Jamaica Portland Crash

ఈ ఘటన జరిగిన వెంటనే స్కూల్ యాజమాన్యం తల్లి తండ్రులకి తెలియచేయడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇదిలాఉంటే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.పోస్ట్‌మార్టం పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో ప్రంజల్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తామని భంధువులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు