Guneet Monga: వీధుల్లో జున్ను అమ్ముకునేది..కానీ నేడు ఆస్కార్ అందుకుంది

గునీత్ మంగా.(Guneet Monga) ఈమె ఎవరో మన వారికి తెలిసే చాన్సే లేదు.

రెండు సార్లు ఆస్కార్ అవార్డు(Oscar award) దక్కించుకుంది.మొదటిసారి 2019లో పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (Period End of Sentence)అనే షార్ట్ ఫిలిం కి ఆమెకి ఆస్కార్ లభించింది.ఇప్పుడు రెండవసారి మరోసారి ఆస్కార్ పురస్కాన్ని ఒడిసి పట్టుకుంది.

ఎలిఫెంట్ విస్పరర్స్ కి(The Elephant Whisperers) ఆమె నిర్మాతగా వ్యవహరించింది.ఈ రోజు ఆమె రెండు ఆస్కార్స్ గెలిచినా కూడా చాలా మందికి తెలియకుండా ఉండటమే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం.

ఒక మహిళ అది కూడా పంజాబీ.మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది.

Advertisement

చూడటానికి బయటకు అందంగా కనిపించే జీవితమే కానీ మూసిన తలుపుల వెనకాల ఏముందో బయట వారికి తెలిసే అవకాశం లేదు.అంత పెద్ద ఇంట్లో ఒక గదిలో మాత్రమే ఉండేవారు.

అన్నదమ్ముల ఆస్తి గొడవలతో చాలా సమస్యలను ఎదుర్కొంది. తన తల్లిని చంపడానికి నా అనుకున్న వాళ్ళే చాల ప్రయత్నాలు చేసారు.

సొంతంగా ఇల్లు కట్టుకోవాలని తన తల్లి ఎప్పుడు ఆరాట పడేది.బతకడానికి ఎన్నో పనులు చేసింది.

ఒకప్పుడు వీధిలో వెన్న, జున్ను తిరుగుతూ అమ్మేది.ఆ తర్వాత డీజే గా, యాంకర్ గా పనులు చేసింది.16 ఏళ్ల వయసు వచ్చేసరికి చదువుకుంటూనే ఓవైపు ఉద్యోగం చేస్తూ ఉండేది.తల్లిదండ్రులకి ఒక సొంత ఇల్లు కొనివ్వాలని లక్ష్యంతోనే ఆమె తన ప్రయాణం మొదలు పెట్టింది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

అలా రూపాయి రూపాయి పోగేసి అంతా కలిసి ఒక ఇల్లును కొనుక్కున్నారు.కానీ ఆరు నెలలు తిరగకుండానే తల్లిని, తండ్రిని కోల్పోయింది.

Advertisement

ఇక సినిమాల్లో పనిచేయడానికి ముంబై వెళ్ళిపోయింది. ఆమెకి సినిమా అనే ప్రపంచం ప్రతిరోజు ఏదో ఒక మార్పు కోసం పని చేస్తూనే ఉండేది.నాలుగు గంటలకు మించి ఏ రోజు నిద్రపోయేది కాదు.

క్రౌడ్ ఫండ్ తో సినిమాలు తీసింది.ప్రతిదీ ఛాలెంజ్ గా తీసుకుంది.

అలా ఆమె తీసిన రెండు డాక్యుమెంటరీస్ కి ఆస్కార్ అవార్డులు అందుకుంది.తను సాధించిన ఈ ప్రగతిని చూడడానికి తన తల్లిదండ్రులు ఇద్దరు బ్రతికి లేరు అనే బాధ తప్ప మరొక సమస్య లేదు అంటుంది గునీత్.

.

తాజా వార్తలు