Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం..!!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )ను స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించింది.

ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై నేషనల్ బృందం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం లోతుగా అధ్యయనం చేయనుందని తెలుస్తోంది.

State Dam Safety Team To Inspect Kaleswaram Project

ప్రస్తుతం బ్యారేజీలను పరిశీలించిన స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం మేడిగడ్డ( Medigadda ), అన్నారం బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజ్( Sundilla Barrage ) పై రిపోర్టు తయారు చేయనుంది.ప్రాజెక్టులు డిజైన్ ప్రకారమే నిర్మించారా? లేదా డిజైన్ లో లోపం ఉందా? నాణ్యత లోపించిందా అనే అంశాలపై స్టేట్ మరియు నేషనల్ బృందాలు వేరు వేరుగా నివేదికలను తయారు చేయనున్నాయి.అనంతరం ఈ నివేదికలను ప్రభుత్వానికి అందజేయనున్నారు.

కాగా ఈ బృందంలో సభ్యులుగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నివేదికల అనంతరం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
State Dam Safety Team To Inspect Kaleswaram Project-Kaleshwaram Project : క�
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?

తాజా వార్తలు