హీరోలే కానీ అంతకన్నా పవర్ ఫుల్ విలనిజం ఈ ఏడాది చూపించబోతున్న నటులు

ఒక‌ప్పుడు హీరోలుగా చేసిన న‌టుల్లో చాలా మంది ఇప్పుడు నెగెటివ్ పాత్రలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

ఒక హీరో నెగెటివ్ పాత్ర‌లో లేదంటే విలన్ రోల్ చేస్తున్నాడంటే ఆ సినిమాకు మంచి హైప్ వ‌స్తోంది.

ఆయా న‌టుల‌కు సైతం మంచి గుర్తింపు వ‌స్తుంది.తెలుగులో ఒక‌ప్పుడు హీరోగా చేసిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు నెగెటివ్ రోల్స్ చేస్తూ అద్భుత గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

తాజా ప‌లువురు హీరోలు విల‌న్ పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇంత‌కీ లేటెస్ట్ సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తున్న హీరోలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప‌- ఫ‌హ‌ద్ ఫాసిల్

Star Heros Movies Releasing This Year As Villains, Fahad Fossil, Pushpa, Gani, U

అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా పుష్ఫ‌.ఈ సినిమాలో ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన ప‌హ‌ద్ ఫాసిల్ విల‌న్ గా న‌టిస్తున్నాడు.

ఘ‌ని- ఉపేంద్ర‌

Star Heros Movies Releasing This Year As Villains, Fahad Fossil, Pushpa, Gani, U
Advertisement
Star Heros Movies Releasing This Year As Villains, Fahad Fossil, Pushpa, Gani, U

సౌతిండియాలో త‌న కంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఉపేంద్ర‌.ఆయ‌న తాజాగా ఘ‌ని అనే సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడు.

విక్ర‌మ్-ఫ‌హ‌ద్ ఫాసిల్

Star Heros Movies Releasing This Year As Villains, Fahad Fossil, Pushpa, Gani, U

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సినిమా విక్ర‌మ్ లో ఫ‌హ‌ద్ ఫాసిల్ నెగెటివ్ క్యారెక్ట‌ర్ పోషిస్తున్నాడు.

అఖండ‌-శ్రీ‌కాంత్

ఫ్యామిలీ సినిమాల హీరో శ్రీ‌కాంత్.బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కుతున్న అఖండ సినిమాలో విల‌న్ రోల్ చేస్తున్నాడు.

అన్న‌థీ-గోపీచంద్

ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న అన్న‌థీ సినిమాలో హీరో గోపీచంద్ నెగెటివ్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు.

వ‌లిమై- కార్తికేయ‌

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

అజిత్ న‌టిస్తున్న వ‌లిమై సినిమాలో కార్తికేయ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు.

ఆదిపురుష్- సైఫ్ అలీఖాన్

Advertisement

బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ సినిమాలో ఎన్నో చిత్రాల్లో హీరోగా చేసిన సైఫ్ అలీఖాన్ విల్ పాత్ర చేస్తున్నాడు.

కేజీఎఫ్-2- సంజ‌య్ ద‌త్

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సినిమా కేజీఎఫ్.య‌శ్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది.ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తున్న కేజీఎఫ్-2 సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సంజ‌య్ ద‌త్ విల‌న్ గా చేస్తున్నాడు.

తాజా వార్తలు