Rajamouli Siraj: క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. నీది చాలా గొప్ప మనసు అంటూ?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు రాజమౌళి.

ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించాయి.అంతేకాకుండా బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో( RRR ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి చూపులు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు రాజమౌళి.ఈ ఒక్క మూవీతో ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.

Ss Rajamouli Appreciate Mohammad Siraj Performance Asia Cup Final

ఇది ఇలా ఉంటే త్వరలోనే మహేష్ బాబుతో( Mahesh Babu ) కలిసి ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఆ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఒకవైపు ఆ స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు చూసుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ట్వీట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Advertisement
Ss Rajamouli Appreciate Mohammad Siraj Performance Asia Cup Final-Rajamouli Sir

ఈ నేపథ్యంలోనే తాజాగా క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌పై( Mohammad Siraj ) దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు.

Ss Rajamouli Appreciate Mohammad Siraj Performance Asia Cup Final

సిరాజ్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు.ఈ మేరకు రాజమౌళి తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు.

అంతే కాకుండా తన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్‌కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.అంటూ పోస్ట్ చేశారు.రాజమౌళి చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు సైతం సిరాజ్‌ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

కాగా.ఆసియాకప్‌ ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది.

Advertisement

అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.

తాజా వార్తలు