Sriya reddy : ప్రభాస్ అలా ప్రవర్తిస్తే పృథ్వీరాజ్ ఇలా ప్రవర్తిస్తారు.. శ్రియారెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్( Salaar ) ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మరికొందరు నటీనటులు కూడా కీలకపాత్రలో నటించారు.

వారిలో నటి శ్రియారెడ్డి( Sriya reddy ) కూడా ఒకరు.ఈ సినిమాలో రాధారమ మన్నార్ క్యారెక్టర్ తో అందరినీ అలరించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా నటి శ్రియారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

Advertisement

ప్రశాంత్‌ నీల్‌( Prashanth Neel ) నన్ను కలిసి, ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నటించేందుకు అంగీకరించలేదు.ఎందుకంటే నేను సినిమాలు చేయకూడదని అప్పటికే నిర్ణయించుకున్నాను.

కానీ, ఎలాగైనా నటింపజేయాలని ప్రశాంత్‌ పట్టుపట్టారు.స్క్రిప్టు పూర్తిగా విని ఆ తర్వాత సమాధానం చెప్పమన్నారు.

నాకు ఆ కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పాను.స్క్రిప్టులో మొదట.

నా పాత్ర లేదు.కథలోకి లోతుగా వెళ్లే క్రమంలో లేడీ విలన్‌ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత ఆ క్యారెక్టర్‌ను రాశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

అందులో విలనిజాన్ని టచ్‌ చేస్తూనే అందంగా చూపించాలనుకున్నారు.రాధారమ ఈ పాత్రకు మంచి పేరు వస్తుందని ప్రశాంత్‌ నీల్‌ నాకు ప్రామిస్‌ చేశారు.ఎలాంటి సందేహం లేకుండా సెట్‌కు వచ్చి నటించమన్నారు.

Advertisement

ఆయనకు తన స్క్రిప్ట్‌ మీద అంత నమ్మకం.అనుకున్నట్లుగానే నాకు మంచి పేరు వచ్చింది.

చిత్రీకరణ సమయంలో అలా చేయను.ఇలా చేయను అని చాలాసార్లు చెప్పా.

కానీ, చివరకు ఒక చిన్న పిల్లలాగా నన్ను ఒప్పించేవారు అని చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి. సలార్ ఫస్ట్‌ పార్ట్‌లో మేం కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాము.

సెకండ్‌ పార్ట్ వేరె లెవెల్ లో ఉంటుంది.రెండో భాగంలో నా పాత్ర నిడివి ఎక్కువ.

ప్రభాస్‌ స్వీట్‌ పర్సన్‌.ఎప్పుడూ కూల్‌గా ఉంటారు.

ఆయనలాగే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌( Prithviraj Sukumaran ) కూడా ఎక్కువగా మాట్లాడరు.ఇద్దరు కూడా ఒకటే ఇద్దరు మౌనంగా సైలెంట్ గా ఉంటారు అని చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి.

తాజా వార్తలు