పండును పెళ్లి చేసుకుంటానన్న శ్రీముఖి

ఢీ షో లో ఇటీవల లేడీ గెటప్‌ వేసి డాన్స్‌ చేసిన పండుకు ఒక్కసారిగా అనూహ్యమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగి పోయింది.

అతడిని అంతా కూడా అభిమానించడంతో పాటు అతడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పండు గురించి గూగుల్‌ లో వేదికేస్తున్నారు అంటే పండు కు ఎంతటి క్రేజ్‌ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.కాస్త ఫేమ్‌ వచ్చిన వారిని క్యాష్‌ షోకు పిలిచి సుమ సందడి చేస్తూ ఉంటుంది.

Srimukhi Want To Marry Dhee Dance Pandu, Sree Mukhi, Pandu, Dhee Dance Show, Sum

ఈ వారం క్యాష్ షో కు శ్రీముఖి, విష్ణుప్రియ, గెటప్‌ శ్రీను మరియు పండు కూడా హాజరు అయ్యారు.ఈ వారం ప్రసారం కాబోతున్న షో కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది.

ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.అందరు కూడా షోలో సందడి చేశారు.

Advertisement

పండు ఆ లేడీ గెటప్‌ వేసుకోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ చెప్పింది.అప్పుడు వెంటనే పండు నాకు ఓకే అన్నట్లుగా ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చాడు.

మొత్తానికి ఆ ఎపిసోడ్‌ మొత్తం సందడి సందడిగా సాగుతుందని ప్రోమో చూస్తేనే అర్థం అవుతుంది.గత సీజన్‌ బిగ్‌బాస్‌ లో సందడి చేసిన శ్రీముఖి ఫైనల్‌ వరకు వెళ్లింది.

ఆ తర్వాత పూర్తి స్థాయి షోను ఏది చేస్తున్నట్లుగా అనిపించడం లేదు.ఒకటి రెండు చిన్న చిన్న షో ల్లో కనిపించినా అవి పెద్దగా హిట్‌ అవుతున్న దాఖలాలు లేవు.

అందుకే ఒక మంచి ఫుల్‌ ల్తెంగ్త్‌ షో ను ప్రయత్నిస్తోంది.క్యాష్‌ షో లో శ్రీముఖిని వచ్చే రెండేళ్లలో సుమను క్రాస్‌ చేస్తా అని అనుకుంటున్నావా లేదంటే అసలు సుమ నాకు పోటీ ఏంటీ అనుకుంటున్నావా అంటూ సుమ ప్రశ్నించిన సమయంలో శ్రీముఖి అంతే సరదాగా సమాధానం చెప్పింది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

రెండేళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.కనుక అప్పటి ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోతాను.అప్పుడు సుమ అక్క నెం.1 గా ఉంటుంది.ఎప్పటికి కలకాలం అక్క నెం.1 యాంకర్‌ గా ఉండాలని కోరుకుంటున్నట్లుగా శ్రీముఖి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు