9 ఏళ్ల తర్వాత తొలి వికెట్ తీసిన శ్రీశాంత్.. ఆనందంలో పిచ్‌పై పడి అతడేం చేశాడో తెలిస్తే !

వెటరన్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఫన్నీగా ఒక ఔట్‌ని సెలబ్రేట్ చేసుకుని అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

పిచ్‌పై బోర్లా పడి అతడు చేసిన సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అయితే శ్రీశాంత్ ఎవరూ ఊహించని రీతిలో సెలబ్రేషన్స్ చేసుకోవడం వెనుక చెప్పుకోదగిన ఒక కారణం ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు శ్రీశాంత్ పాల్పడ్డాడని 2013లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.దీన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతనిపై లైఫ్ టైం బ్యాన్ విధించింది.

దీంతో షాక్ అయిన శ్రీశాంత్ ఈ జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు.దీంతో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Advertisement

దాంతో బీసీసీఐ 2020 సెప్టెంబర్ 13న అతడిపై లైఫ్ టైం బ్యాన్ లిఫ్ట్ చేసింది.అప్పట్నుంచి రంజీ ట్రోఫీలో కేరళ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శ్రీశాంత్.

అయితే తాజాగా కేరళ జట్టు మేఘాలయాతో తన తొలి మ్యాచ్ ఆడింది.ఈ మ్యాచ్‌లో 40వ ఓవర్ లో మేఘాలయ బ్యాటర్ ఆర్యన్ బౌరాను శ్రీశాంత్ ఔట్ చేశాడు.అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్‌ వికెట్ తన ఖాతాలో పడటంతో భావోద్వేగానికి గురయ్యాడు శ్రీశాంత్.

ఆ తర్వాత సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఈ ఔట్‌ని సెలబ్రేట్ చేశాడు.అతడు అలా ఒక్కసారిగా బోర్లా పడటంతో టీంమేట్స్ షాక్ అయ్యారు.ఏమైందో ఏమో అని అతన్ని లేపడానికి ప్రయత్నించారు.

ఆ తర్వాత అతడు ఎమోషనల్ అయిపోయి వికెట్లకు సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్య పోయారు.దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

శ్రీశాంత్ సెలబ్రేషన్స్ ఇలానే ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోని స్వయానా శ్రీశాంత్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా షేర్ చేశాడు.

Advertisement

దీనికి ఇప్పటికే 5 లక్షల వ్యూస్, 31 వేల లైకులు వచ్చాయి.మీరు కూడా ఓ ఈ వీడియోపై లుక్కేయండి.

తాజా వార్తలు