అట్లతద్ది ఎందుకు చేసుకుంటారో తెలుసా?

అట్లతద్ది తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ.ఈ పండుగ రోజు అమ్మాయిలు తెలుగుదనం ఉట్టిపడేలా తయారయ్యే ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వచ్చే ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ అట్లతద్ది జరుపుకుంటారు.ఈ పండుగను నగరాలలో కన్నా పల్లెలలో ఎంతో సందడిగా జరుపుకుంటారు.

Significance Of Atla Taddi Festival, Atla Taddi Festival,Rice ,moon ,Pregnancy ,

మన తెలుగు సాంప్రదాయ మహిళలు ఎల్ల వేళల నిండు సౌభాగ్యంతో ఉండాలని ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు.అట్లతద్ది నాడు పెళ్ళికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైన వారు దీర్ఘ సుమంగళి గా ఉండాలని అట్లతద్ది రోజు ఆ గౌరీదేవికి వ్రతం ఆచరిస్తారు.

మహిళలందరూ పెద్ద ఎత్తున గౌరీ దేవి వ్రతం నిర్వహించి సాయంత్రం చంద్రోదయం సమయంలో అట్లను నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకు వాయన తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటారు.అట్లతద్ది నాడు అట్లను చేయడానికి కూడా పురాణాల ప్రకారం ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది.

Advertisement

సాధారణంగా మనం అట్ల తయారీకి బియ్యం, మినప్పప్పును ఉపయోగిస్తాము.బియ్యం నవగ్రహాలలో చంద్రునికి సంబంధించినది కాగా, మినుములు రాహు గ్రహానికి సంబంధించినవి.

ఇటువంటి ధాన్యాలతో చేసిన అట్లను గౌరీవ్రతం లో నైవేద్యంగా సమర్పించి వాయినాలు ఇవ్వడం ద్వారా స్త్రీలలో ఏర్పడే గర్భదోషాలు సైతం తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం.కుజదోషంతో వివాహం కాని వారు అట్లతద్ది నాడు కుజునికి అట్లను సమర్పించడం ద్వారా కుజ దోషం తొలగిపోయి వివాహం జరుగుతుంది.

ఈ అట్లతద్ది పండుగను గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఉదయం లేచిన దగ్గరనుంచి పూజా కార్యక్రమాలలో నిమగ్నమై, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సాంప్రదాయ దుస్తులను ధరించి, చేతులకు గోరింటాకు పెట్టుకుని గౌరీ దేవికి పూజలు నిర్వహిస్తారు.

అనంతరం చెట్లకు ఊయలలు వేసుకొని పాటలు పాడుతూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు