మహిళను కాపాడిన నల్లగొండ జిల్లా పోలీసులను అభినందించిన ఎస్పీ

నల్లగొండ జిల్లా: ఆపదలో ఉన్న మహిళను సకాలంలో పోలీస్ వాహనంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

వివరాల్లోకి వెళితే.

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అంగోతు తండాకి చెందిన నందు-శ్రీనివాసులు అనే భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవకు మనస్తాపం చెందిన భార్య నందు ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిది.వెంటనే గమనించిన భర్త తన మోటర్ సైకిల్ పైన ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో కొత్తబావి గేటు వద్ద కొండమల్లెపల్లి ఎస్ఐ రాముర్తి తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

SP Congratulated Nalgonda District Police For Saving The Woman, SP ,Nalgonda Dis

అపస్మారక స్థితిలో ఉన్న భార్యను తీసుకెళుతున్న భర్త శ్రీనివాస్ పోలీసులకు జరిగిన విషయం చెప్పగా వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి బాధితురాలిని పోలీస్ వాహనంలో సకాలంలో దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.ప్రస్తుతం మహిళా పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలకు క్షణికావేశంలో హత్మహత్యలు చేసుకుంటే వారి మీద ఆధారపడిన పిల్లలు,వారి కుటుంబ సభ్యులు పరిస్థితులు ఆగమవుతాయన్నారు.జీవితంలో కష్టసుఖలు సాధారణమని,వాటిని అదికమించి నిలబడి జీవించాలన్నారు.

Advertisement

ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరు కూడా తీసుకోకూడని సూచించారు.సకాలంలో స్పందించి మహిళా ప్రాణాలు కాపాడిన కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ్య,ఎస్ఐ రాముర్తి,సిబ్బంది మజీద్, రాము,ప్రవీణ్, మల్లిఖార్జున్ లను శనివారం జిల్లా ఎస్పీ తన ఆఫీస్ కు పిలిచి అభినందించారు.

హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!
Advertisement

Latest Nalgonda News