సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ ఆఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

సబ్ డివిజనల్ పరిధిలో నమోదు అయిన కేసుల వివరాలు,ఎస్సీ ఎస్టీ, ఫోక్సో కేసుల, గ్రేవ్ కేసులలో,అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల వివరాల అడిగి తెలుసుకుని పలు సూచనలు చేసి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లలోఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు.సబ్ డివిసన్ పరిధిలో నేరల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని,నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ లో పెట్రోలింగ్,విజిబుల్ పోలీసింగ్ లు నిర్వహించాలన్నారు.

లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నేర నియంత్రణలో భాగంగా సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అందుకు అనుగుణంగా ప్రజలకి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలని అవగాహన కల్పించాలన్నారు.సబ్ డివిజన్ పరిధిలో జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై కఠినంగా వ్యవహారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు.ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ విశ్వప్రసాద్, సి.ఐలు అనిల్ కుమార్, ఉపేందర్,సిబ్బంది ఉన్నారు.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

Latest Rajanna Sircilla News