చింతల్ టానాలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు!

వేములవాడ అర్బన్ మండలం: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అని వేములవాడ అర్బన్ మండల ప్రజా ప్రతినిధులు కొనియాడారు.

 Inauguration Of Ambedkar Statue To Mark Ambedkar Jayanti-TeluguStop.com

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అర్బన్ మండలంలోని చింతల్ టానా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు బుద్ధ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, జెడ్పిటిసి మ్యాకల రవి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అంబేడ్కర్ భారతదేశంలో బడుగు బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడన్నారు.

ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా, అందరినీ సమానంగా చూడాలనే గొప్ప ఉద్దేశ్యంతో రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం ముందుకు నడుస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు నామకరణం చేశారని, అంతేకాకుండా ప్రపంచంమే అబ్బుర పరిచేలా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి హైదారాబాద్ కు చారిత్రాత్మకమైనటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.

నవభారత రాజ్యాంగ నిర్మాత అనగారిన వర్గాల పక్షాన నిలిచిన మహానీయుడు అంబేడ్కర్ అని అన్నారు.దేశంలో అంటరానితనం సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడి జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేగులపాటి రాణి, సెస్ డైరెక్టర్ రేకులపాటి హరిచరన్ రావు, వైస్ ఎంపీపీ రవిచందర్ రావు, విగ్రహ దాతలు కుమ్మరి రమేష్, సురువు వెంకటి,మంత్రి రమేష్, నెదురు ఎల్లయ్య, సుంచు నరసయ్య, మంత్రి సతీష్ కుమార్, బడుగు శ్రీనివాస్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు దళిత బహుజన నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube