త్వరలో బీజేపీలో పెను మార్పులు..!!

భారతీయ జనతా పార్టీలో త్వరలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం కన్పిస్తోంది.

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ రెండు వారాల్లో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోందన్న వార్తలు జోరందుకున్నాయి.

ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉంది.

అయితే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగతంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రదాన్ తో పాటు భూపేంద్ర యాదవ్ కు కొత్త బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.

అంతేకాకుండా గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.కాగా పార్లమెంట్ సమావేశాలకు ముందే రాష్ట్రాల నాయకత్వ మార్పులతో పాటు మంత్రివర్గ విస్తరణపై ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

అయితే జూలై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?
Advertisement

తాజా వార్తలు