తెలంగాణలో పేద మహిళలకు నెలకు ₹2500 ప్రకటించిన సోనియా గాంధీ..!!

రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన "తెలంగాణ విజయభేరి" సభలో సోనియా గాంధీ( Sonia Gandhi ) తెలంగాణ మహిళలకు సంచలన హామీ ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు నెలకు ₹2500 ఆర్థిక సాయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

"మహాలక్ష్మి" పథకం( Maha lakshmi Scheme ) కింద మహిళలకు ₹2500, ఇంటి అవసరాల కోసం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Sonia Gandhi Announced ₹2500 Per Month For Poor Women In Telangana , Sonia Gan

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ యువ వికాసంలో భాగంగా ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.అంతేకాదు అంబేద్కర్ అభయ హస్తం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.అదేవిధంగా ఏకకాలంలో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ( Rythu Runa Mafi ) చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది.

ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.జరగబోయే ఎన్నికలలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

Advertisement
నితిన్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా..?

తాజా వార్తలు