విట‌మిన్ ఎ లోపం ఎన్ని చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుందో తెలుసా?

చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని పోష‌కాలు ఎంతో అవ‌స‌రం.అటు వంటి పోష‌కాల్లో విట‌మిన్ ఎ ఒక‌టి.

చాలా మంది ఆరోగ్యానికి మాత్ర‌మే విట‌మిన్ ఎ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తుంటారు.కానీ, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లోనూ విట‌మిన్ ఎ కీల‌క పాత్ర పోషిస్తుంది.

పొర‌పాటున‌ శ‌రీరంలో విల‌మిన్ ఎ లోపం ఏర్ప‌డిందా ఇక అనేక చ‌ర్మ సంబంధిత స‌మ్యలు చుట్టు ముట్టేస్తాయి.మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటీ.

వాటిని ఏ విధంగా త‌గ్గించుకోవాలి వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.చ‌ర్మ కాంతిని పెంచ‌డంలోనూ విట‌మిన్ ఎ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Skin Care Problems Of Vitamin A Deficiency! Skin Care Problems, Vitamin A Defici

కానీ, అదు విట‌మిన్ ఎ శ‌రీరానికి స‌రిగ్గా అంద‌కుంటే మాత్రం కొత్త చర్మ కణాల ఉత్పత్తి త‌గ్గి పోతుంది.ఫ‌లితంగా చ‌ర్మం కాంతి హీనంగా త‌యారు అవుతుంది.

Skin Care Problems Of Vitamin A Deficiency Skin Care Problems, Vitamin A Defici

అలాగే ముడ‌త‌లు రాకుండా అడ్డు క‌ట్ట వేసే సామ‌ర్థం విట‌మిన్ ఎ కి పుష్క‌లంగా ఉంది.అయితే ఒక వేళ మీలో విట‌మిన్ ఎ లోపించిందీ అంటే చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని చారలు ప‌డి.పెద్ద వ‌య‌సు వారిలా క‌నిపిస్తారు.

Skin Care Problems Of Vitamin A Deficiency Skin Care Problems, Vitamin A Defici

ఇక శ‌రీరంలో విట‌మిన్ ఎ లోపిస్తే గ‌నుక‌ చ‌ర్మంపై మొటిమ‌లు, వాటి మూలంగా న‌ల్లటి మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి.చ‌ర్మం పొడిబారి పోతుంది.వృద్ధాప్య‌ ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌చ్చేస్తాయి.

చ‌ర్మం డ‌ల్‌గా, నిర్జీవంతంగా మారుతుంది.కాబ‌ట్టి, ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌న్నిటికీ దూరంగా ఉండాలీ అంటే శ‌రీరంలో విట‌మిన్ ఎ లోపం ఏర్ప‌కుండా చూసుకోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అందు కోసం క్యారెట్‌, గుడ్డు, గుమ్మ‌డి కాయ‌, ట‌మాటా, క్యాప్సిక‌మ్‌, బొప్పాయి, పాల‌కూర‌, మెంతికూర‌, బ్రొకోలీ, చిల‌క‌డ దుంప‌లు, చేప‌లు, మెంతులు, పాలు, ద్రాక్ష పండ్లు, పుచ్చ‌కాయ‌, కివి వంటి ఆహారాలు ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.త‌ద్వారా విట‌మిన్ ఎ లోపం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు